»Tsrtc Hyderabad To Vijayawada Buses Available In Every 10 Minutes
TSRTC : ఆ రూట్లో ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు
వేసవి సెలవుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్ని ఏర్పాటు చేసింది.
Hyderabad To Vijayawada TSRTC Buses : వేసవి కాలం సెలవుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కుటుంబ సమేతంగా వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ఈ రూట్లూ సాధారణం కంటే ఎక్కువ రద్దీ చోటు చేసుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ రోట్లో ప్రయాణాన్ని చక్కగా కొనసాగించవచ్చు.
ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. సెలవుల సందర్భంగా ఈ (HYDERABAD TO VIJAYAWADA) రూట్లో రోజుకు 120కి పైగా బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కావాలనుకుంటే ఈ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు ముందుగా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అలా చేసుకున్న వారికి టికెట్టుపై పది శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించింది. తిరుగు ప్రయాణ టికెట్‌పై ఈ రాయతీ వర్తిస్తుందని తెలిపింది. http://tsrtconline.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ రూట్లో తిరిగే మొత్తం 120కి పైగా బస్సుల్లో 62 సూపర్‌లగ్జరీ, 41 రాజధాని, 9గరుడ ప్లస్, 10 ఈ గరుడ, 2 నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, 2 లహరి ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62… pic.twitter.com/nvG8kzoaRH
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) April 27, 2024