»Nepal Seven Indians Died In A Bus Washed Away In The River
Nepal: నదిలో బస్సు కొట్టుకుపోయిన ఘటనలో.. ఏడుగురు భారతీయులు మృతి
నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
Nepal: Seven Indians died in a bus washed away in the river
Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరపిలేని వర్షాలకు నేపాల్‌లో కొన్నిదగ్గర కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై 66 మంది టూరిస్ట్‌లతో వెళ్తున్న రెండు బస్సులపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి.
ప్రయాణికులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు భారతీయులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం నదిలో గల్లంతైన వారి కోసం అధికారులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.