రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి మాయమాటలు చెప్పి కోట్లు డబ్బు కొట్టేస్తున్నారు.
Cyber Crime: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి మాయమాటలు చెప్పి కోట్లు డబ్బు కొట్టేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)లో ఇవే కేసులు ఎక్కువగా ఉన్నాయి. కూకట్పల్లిలోని వసంత్నగర్కు చెందిన ఓ వ్యాపారి గోల్డ్మెన్ సాచ్ బిజినెస్ స్కూల్లో చేరాలంటూ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. షేర్ల గురించి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అలా ఓ గ్రూప్లో చేర్చారు. ఇందులో పెట్టుబడులు పెడితే ఆదాయం వస్తుందనగా.. రూ.5.98 కోట్లు పెట్టబడి పెట్టారు.
ఆ షేర్ల విలువ పెరిగిందని రూ.21 కోట్లుగా చూపించారు. అందులో కొంత తీసుకుంటానని వ్యాపారి వాళ్లకు చెప్పారు. అయితే దానికి లాభంలో 20 శాతం కింద రూ.2.88 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఈ విషయం కోసం గ్రూప్లో చర్చించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే మరో వృద్ధుడికి కాల్ చేసి మీపై మనీలాండరింగ్ కేసు ఉందన్నారు. ఐపీఎస్ అధికారినంటూ పేరుతో మోసం చేసి మొత్తం రూ.4.82 కోట్లు కొట్టేశారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఇలాంటి మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే జాగ్రత్త.