Narendra modi : దేశాధిపతుల నుంచి మోదీకి శుభాకాంక్షల వెల్లువ
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రధాన మంత్రిగా మోదీ మరోసారి అధికారంలోకి రావడం లాంఛనం అయ్యింది. ఈ క్రమంలో మోదీకి పలు దేశాధిపతుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Lok Sabha Election Results 2024 : లోక్ సభ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి మరోసారి విజయ దుందుభి మోగించింది. దీనితో ముచ్చటగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలు విదేశీ నాయకుల(WORLD LEADERS) నుంచి మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎక్స్ వేదికగా ఆయనను కంగ్రాట్యులేట్ చేస్తూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమ సింఘె మోదీకి( MODI) శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు తాము ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే
ఇటలీ ప్రధాని(ITALY PM) జార్జియా మెలోనీ మోదీకి ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి పరస్పరం సకరించుకుంటూ కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అయితే తాము కూడా ఇటలీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ రీ ట్వీట్ చేశారు.
మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు సైతం మోదీకి అభినందనలు తెలిపారు. మూడోసారి వరుసగా గెలుపొందడంపు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, మాల్దీవుల మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. అలాగే నేపాల్(NEPAL) ప్రధాని దహల్ ప్రచండ కూడా మోదిని అభినందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సైతం మోదీని అభినందించారు. మారిషస్ ప్రధాని ప్రవింద కు మ ఆర్ జుగ్నాథ్ సైతం మోదీ సారథ్యంలోని భారత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అభిలషించారు.