Today Gold Rate In Hyderabad
Gold and Silver Rates Today : వరుసగా ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ కనిపిస్తున్నాయి. దీంతో రికార్డు హై ధరల్లోకి వెళ్లిన వీటి ధరలు మళ్లీ దిగి వస్తాయని కొనుగోలుదారులు ఆశపడతున్నారు. ఒక రకంగా ఇది వెండి, పసిడి కొనుగోలుదారులకు ఆశాజనకమైన వార్తే అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బుధవారం.. పది గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 74,385కు చేరుకుంది.
చదవండి : సెలవులపై విదేశాలకు సీఐడీ చీఫ్, పారిపోతున్నారంటూ భారీగా ట్రోల్స్
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,385 గానే ఉంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. గుర్తుంచుకోవాలి. నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని వినియోగదారులు గమనించుకోవాలి.
చదవండి : ఈ ఎన్నికల్లో చిత్రమైన విజయాలు వీరివి!
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సైతం భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే రూ.1801 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 91,640కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి చెప్పుకోదగ్గ మేర తగ్గుముఖం పట్టడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2347 డాలర్లుగా ఉంది. అలాగే ఔన్సు వెండి ధర 29.72 డాలర్లుగా ఉంది.

