Gaza: An Indian was killed when a vehicle was attacked!
Gaza: భారత్ తరపున ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారతీయుడు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై రఫాలో దాడి జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బందిలో సంభవించిన తొలి మరణం ఇదే. అతను ఐక్యరాజ్య సమితిలోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో అతను భారత సైన్యంలో పనిచేసినట్లు తెలిపారు.
రఫాలోని యురోపియన్ హాస్పిటల్‌కు వెళ్తుండగా వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలన్నారు. సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు. బందీలను విడిచిపెట్టాలని హమాస్‌ను కోరారు.