Polling Day In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పలు కారణాలతో మొత్తం 12 మంది మృతి చెందారు. వడగాల్పులు(heat wave) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ఏడుగురు మరణించారు. అలాగే గుండె పోటుతో ముగ్గురు, రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు విడిచారు.
కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన ఈశ్వరరావు(72), విశాఖపట్నం జిల్లా పాలవలసకు చెందిన సత్యం(80), శ్రీసత్య సాయి జిల్లా బీజీ హళ్లికి చెందిన మారక్క(86), పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన నాగమణి(68), అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామానికి చెందిన జయవరపు నాగయమ్మ(89), పార్వతీపురం మన్యం జిల్లాలో పెదఖరకు చెందిన బిడ్డిక రాజారావు(80)లు ఓటేసి ఇళ్లకు వెళుతూ ఎండతో అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ప్రాణాలు విడిచారు.
ఓటేసేందుకు క్యూ లైన్లో నిలబడి… కృష్ణా జిల్లా పెదపులిపాకకు చెందిన కలగర వెంకటేశ్వర రావు(75), పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రకు చెందిన పిల్లి సువర్ణ రాజు(71), ఏలూరు జిల్లా విజరంకి చెందిన ప్రభాకర రావు(65) గుండెపోటుతో(heart attack) మరణించారు. ఓటేసేందుకు వచ్చి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.