ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో ఐఏఎస్ అధికారుల నియామకంలోనూ కీలకమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను నియమించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
AP New CS : ఏపీలో పలు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త చీఫ్ సెక్రటరీగా( CS ) విజయానంద్(vijayanand) నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌లో ఉన్న జవహర్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగుస్తుంది. దీంతో విజయానంద్‌ని(vijayanand) నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
ఐఏఎస్ అధికారి కె. విజయానంద్(k. vijayanand) గత ప్రభుత్వంలోనూ కొన్ని రోజులపాటు అదనపు సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992 బ్యాచ్‌కు చెందిన విజయ్ నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌గానూ గతంలో పని చేశారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగానూ పని చేశారు. అలాగే ఎనర్జీ, ఐటీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగానూ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.