Kim Lipstick Ban : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(KIM JONG UN) పేరు వినగానే అందరికీ రకరకాల నిబంధనలే గుర్తుకొస్తాయి. ఆయన ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియనే తెలియదు. అందుకనే ఉత్తర కొరియాకు ఎవరైనా వెళ్లాలన్నా కూడా భయపడుతుంటారు. ఇక కిమ్(KIM) అక్కడి ప్రజలు ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేయించుకోవాలి? లాంటి వ్యక్తిగత విషయాలను కూడా శాసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడి మహిళలు రెడ్ లిప్‌స్టిక్ వేసుకోవడంపైనా ఆయన తాజాగా బ్యాన్ విధించారు.
మహిళలు, యువతులు ఎర్రటి లిప్‌స్టిక్(RED LIPSTICK) వేసుకోవడం వల్ల అది కమ్యునిజంకి గుర్తు అని ఉత్తర కొరియా అధినాయకత్వం భావిస్తోంది. పెట్టుబడిదారీ విధానానికి అది గుర్తు అని పేర్కొంది. అందుకనే ఇకపై అక్కడి మహిళలు ఎవరూ రెడ్ లిప్‌స్టిక్ వాడకూడదని బ్యాన్ విధించింది. అక్కడి ప్రజలు మేకప్ వేసుకోవడానికి కూడా అనుమతి లేదు. పాశ్చాత్య సంస్కృతికి యువత లోను కాకూడదని అవేమీ లేకుండా సహజంగా ఉండేందుకు ప్రయత్నించాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
ఇలాంటి ఆంక్షలు, నిబంధనలకు ఉత్తర కొరియాలో(NORTH KOREA) కొదవే లేదు. అక్కడ ఎవరూ స్కిన్నీ జీన్స్‌లు వేసుకోకూడదు. అలాగే కిమ్ తరహాలో హెయిర్ స్టైల్ చేయించుకోకూడదు. ఆయనకులాగ నలుపు రంగు ట్రెంచ్ కోట్లు ఎవరూ ధరించకూడదు. ఎవరైనా ఇలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. అందుకనే అక్కడి వారు ప్రభుత్వ ఆంక్షలకు లోబడే వారి డ్రస్సింగ్ చేసుకుంటూ ఉంటారు.