»North Korea Email Account Of South Korean President Hacked
North Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి ఈమెయిల్ ఖాతా హ్యాక్
దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ సిబ్బందిలో ఒకరి ఈమెయిల్ ఖాతాను ఉత్తర కొరియా హ్యక్ చేసింది. ఈ హ్యాక్ కారణంగా తమ దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.
North Koriea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ సిబ్బందిలో ఒకరి ఈమెయిల్ ఖాతాను ఉత్తర కొరియా హ్యక్ చేసింది. గతేడాది నవంబర్‌లో యోల్ యూకే పర్యటన నాటి వరకు దీని నుంచి సమాచారం చౌర్యం కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని సియోల్ అధికారులు కూడా ధ్రువీకరించారు. సదరు సిబ్బంది వ్యక్తిగత ఈమెయిల్‌ను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించడాని తెలిపారు. అధ్యక్షుడి పర్యటన వివరాలు మొత్తం ముందుగానే హ్యాకర్లకు చేరినట్లు తెలిపారు. స్థానిక పత్రికలు మాత్రం అధ్యక్షుడు యోల్ పంపించిన రహస్య సందేశాల వివరాలు కూడా హ్యాకర్లు తస్కరించినట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించలేదు.
ఉత్తర కొరియా సైబర్ బృందాలు తొలిసారి దక్షిణ కొరియా అధ్యక్ష బృందంలోని కీలక వ్యక్తి వివరాలను దక్కించుకోగలిగాయి. మరోవైపు దీనిపై యోల్ కార్యాలయం స్పందించింది. నియమాలను పాటించడంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి అధికారిక కార్యకలాపాలకు కమర్షియల్ ఈమెయిల్‌ను వాడాడని తెలిపారు. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన సైబర్ బృందాలున్నాయి. ఆంక్షల కారణంగా ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యం రాక చాలా కష్టం.
ఈ నేపథ్యంలో ఇక్కడి హాకర్లు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. ఈ బృందాలు 2016లో ఏకంగా 3 బిలియన్ డాలర్లను చోరీ చేశాయి. ఈ హ్యాక్ కారణంగా తమ దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.