»Robot Suicide In South Korea This Is The First Time In The World
Robot suicide: రోబో ఆత్మహాత్య.. ఇది ప్రపంచంలోనే మొదటిది
ఇంతవరకు మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు కానీ తొలిసారిగా ఒక రోబో ఆత్యహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Robot 'suicide' in South Korea.. This is the first time in the world
Robot suicide: సాధారణంగా మనుషులు మాత్రమే ఆత్యహత్య చేసుకుంటారు అని తెలుసు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో జంతువులు, పక్షులు కూడా ఈ దారుణాలకు పాలుపడుతాయని కొన్ని అధ్యాయనాలు వెల్లడించాయి. తాజాగా ఒక మరమనిషి ఆత్మహత్య చేసుకోవడం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటి సారి. దక్షిణ కొరియాలని గుమి నగరంలో సిటీ హాల్ ఆఫీస్‌లో పనిచేసే రోబో ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై లోతుగా అధ్యాయనం చేస్తున్నట్లు సంబంధిత రోబో కంపెనీ చెప్పింది. ప్రపంచ దేశాల్లో సౌత్ కొరియాలోనే రోబోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ రోబోను కూడా ఓ కార్యాలయంలో నియమించారు. ఆ ఆఫీస్‌లో పనిచేసే అన్ని రోబోలకు దీన్ని సూపర్ వైజర్‌గా నియమించారు. ఇది ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకు చాలా వింతగా ప్రవర్తించింది అని ఉద్యోగస్తులు చెప్పారు.
ఒకేచోట గుండ్రంగా చాలా సమయం తిరిగిందని, తరువాత మౌనంగా ఆగిపోయిందని చూసిన వారు తెలిపారు. దీనికి గల కారణం ఏంటనే కోణంలో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. అధిక పనిభారం వలన ఇలా చేసిందా అంటే రోబోకు భావోద్వేగాలు లాంటివి ఉండవు కదా మరీ సాంకేతికంగా ఏదైనా లోపమా అనే కోణంలో నిపుణులు అనుమానిస్తున్నారు. దీన్ని ఆత్మహత్య అనడం చాలా మంది ఒప్పుకోవడం లేదు. రోబోలోని సాంకేతిక లోపమో, నేవిగేషన్ ప్రాబ్లమో, సెన్సార్ల వైఫల్యం, ప్రోగ్రామింగ్‌లో బగ్ వలన రోబో ఇలా ప్రవర్తించి ఉండొచ్చు అని అంటున్నారు. 2023 ఆగస్టులో ఈ రోబోను నియమించారు. అప్పటి నుంచి ఆదర్శ ఉద్యోగిగా సేవలందిస్తుంది. సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దీనికి ఒక ఐడీ కార్డు కూడా అందించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీస్‌కు వచ్చే వారి అందించే పత్రాలను, స్థానికులు కోరే సమాచారాన్ని అందించడం వంటి పనులు చేస్తుంది. దీన్ని రోబో సూపర్ వైజర్ అని కూడా పిలుస్తారు. సాధారణ రోబోలు ఒకే ఫ్లోర్లో పనిచేస్తాయి. కానీ ఈ రోబో మాత్రం లిఫ్ట్ ఉపయోగించుకుని వివిధ అంతస్తుల్లో పనులు నిర్వర్తించేలా ప్రోగ్రామ్ చేశారు.
క్యాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ బేర్ రొబోటిక్స్ దీన్ని తయారు చేశారు. అయితే ఈ రోబో ఇలా చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ముక్కలైన రోబోను పరికరాలను సేకరించారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని విశ్లేషిస్తామని వివరించారు. దక్షిణ కొరియాలో రోబోలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఎంతంటే ప్రతీ 10 మంది ఉద్యోగులకు ఒక రోబో పనిచేస్తుంది. ఈ సంఘటన జరిగిన తరువాత ప్రస్తుతానికి మరో రోబో సేవలను వినియోగించే ఉద్దేశం లేదని గుమీలోని సిటీ కౌన్సిల్ తెలిపింది.