»Kim Shocked South Korea Deputy Prime Minister Post For North Korean Diplomat
Kim Jong Un: కిమ్ షాక్ ఇచ్చిన దక్షిణ కొరియా.. ఉత్తర కొరియా దౌత్యవేత్తకు ఉపముఖ్యమంత్రి పదవి
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు దక్షిణ కొరియా షాక్ ఇచ్చింది. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన దౌత్యవేత్తకు ఏకంగా ఉప మంత్రి పదవి ఇచ్చింది. సౌత్ కొరియాకు వచ్చిన తరువాత కిమ్‌పై పలు ఆరపణలు చేశారు. కిమ్ అరాచక పాలనగురించి అంతర్జాతీయ మీడియాలో ఆరోపించిన విషయం తెలిసిందే.
Kim Shocked South Korea.. Deputy Prime Minister post for North Korean diplomat
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షిడికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఆ దేశం నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన దౌత్యవేత్తకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి కిమ్ జోంగ్ ఉన్‌కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్ యేల్ ఆదేశాలు జారీ చేశారు. టై యోంగో లండన్‌లోని ఉత్తరకొరియా దౌత్య కార్యాలయంలో మినిస్టర్ హోదాలో పని చేస్తున్న క్రమంలోనే 2016లో దక్షిణ కొరియాకు పారిపోయారు. ఆ వార్త సంచలనంగా మారింది. ఎందుకంటే నార్త్ కొరియా పాలకుల నుంచి తప్పించుకోవడం అంటే మాములు విషయం కాదు. అందులో మినిస్టర్ హోదాలో పని చేసే వ్యక్తి టై యోంగో వారి నుంచి పారిపోయి సియోల్‌లో తలదాచుకున్నారు.
అలా దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన యోంగో ఉత్తర కొరియాలో నరకం అనుభవించినట్లు, తన బిడ్డలు ఒక నిర్భందంలో బతికినట్లు యోంగో వెల్లడించారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విధిస్తున్న మరణశిక్షల గురించి వివరించారు. ఆయన చేస్తున్న నిరంకుశ పాలనను చెప్పారు. దాంతో పాటు కిమ్‌కు ఉన్న అణుబాంబులపై ఇష్టం కూడా తనకు నచ్చలేదన్నాడు. అదే సమయంలో ఉత్తర కొరియా యోంగోను ఒక దొంగలా అభివర్ణించింది. ప్రజాధనాన్ని అతడు అపహరించినట్లు, అనేక నేరాలు పాల్పడి దేశం వదిలి వెళ్లినట్లు పేర్కొంది.
ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్ యేల్ తాజా నిర్ణయం తీసుకున్నారు. పీస్ఫుల్ యూనిఫికేషన్ కౌన్సిల్‌కు టై యోంగోను సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక చేశారు. ఈ కౌన్సిల్ ఉత్తరకొరియాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ద.కొ అధ్యక్షుడికి సూచనలు ఇస్తుంది. మాములుగానే ఉ.కొ నుంచి పారిపోయి వచ్చేవారికి ఇక్కడి ప్రభుత్వం పౌరసత్వాలు, ఉచిత అపార్ట్మెంట్లు, డబ్బు లాంటివి ఇస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడు యూన్‌సుక్ యేల్ సైతం తమ దేశానికి వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా గతవారం నార్త్కొరియన్ డిఫెక్టర్స్డేను నిర్వహించింది.