»Ed Sent Sixth Summons To Arvind Kejriwal Called For Questioning On February 19
Liquor Scam : అరవింద్ కేజ్రీవాల్ కు ఆరో సారి ఈడీ సమన్లు.. ఫిబ్రవరి 19న విచారణకు పిలుపు
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది.
Liquor Scam : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికే ఐదుసార్లు సమన్లుజారీ చేసింది. అయినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఈడీ సమన్లను ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు.
జనవరి 31, జనవరి 17, జనవరి 3, డిసెంబర్ 21, నవంబర్ 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఈడీ నిరంతరం సమన్లు జారీ చేసిన తరువాత, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈ ప్రక్రియ అంతా జరుగుతోందని పేర్కొంది. ప్రశ్నించే సాకుతో అతడిని పిలిపించి అరెస్టు చేయాలని ఈడీ కోరుతోంది. ఒకవేళ ఈడీ ప్రశ్నించాలనుకుంటే తన ప్రశ్నలను రాసి కేజ్రీవాల్‌కు ఇవ్వవచ్చని ఆప్ చెప్పింది.
ఈడీకి పంపిన లేఖలో కేజ్రీవాల్ చట్టపరమైన సమన్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఈడీ సమన్లు కూడా మునుపటి సమన్ల మాదిరిగానే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ నేను నా జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా గడిపానని చెప్పారు. నేను దాచడానికి ఏమీ లేదన్నారు.