»Have You Seen Heroine Rambhas Daughter She Is Very Beautiful
Rambha daughter: రంభ కూతురిని చూస్తే రచ్చ రంబోలానే!
దాదాపు రెండు దశాబ్దాల పాటు అన్ని సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్గా ఓ ఊపు ఊపేసింది రంభ. ఇక సినీ కెరీర్ క్లోజ్ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ, పిల్లలతో సెటిల్ అయిపోయింది. తాజాగా రంభ తన కూతురు ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Have you seen heroine Rambha's daughter.. She is very beautiful.
Rambha daughter: రంభ.. ఈ పేరు వింటే అప్పట్లో అంటే, 90s కుర్రకారుకి నిద్ర పట్టేది కాదేమో. అచ్చు దేవలోకం నుంచి దిగి వచ్చిన రంభలా ఉంటుంది రంభ. అందుకే.. అమ్మడి అందానికి రాజమౌళి కూడా ఫిదా అయిపోయాడేమో. యమదొంగ సినిమాలో రంభతో స్పెషల్ సాంగ్ చేయించాడు దర్శక ధీరుడు. నాచోరే నాచోరే సాంగ్లో ఎన్టీఆర్తో చిందులేసిన రంభ.. దేశ ముదురు సినిమాలో బన్నీతో స్టెప్పులేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దాదాపుగా దూరమైపోయింది రంభ. ప్రస్తుతం రంభ తన భర్త పిల్లలతో కెనడాలో నివాసం ఉంటోంది. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తు ఉంటుంది. లేటెస్ట్గా తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ఇక రంభ కూతురిని చూసిన తర్వాత కుర్రాళ్లు రచ్చ రంబోలా అనేలా ఉంది. రంభకి మొత్తం ముగ్గురు పిల్లలున్నారు.. ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇంకా టీనేజ్ వయసులో ఉంది. బహుశా రంభ ఆమెను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే.. తరచుగా తన కుమార్తె ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ‘మై ఎంజల్’ అంటూ రంభ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తల్లి లాగే క్యూట్ లుక్తో కట్టిపడేస్తోంది రంభ కూతురు. తల్లికి మించిన కూతురు అని బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్స్. ఖచ్చితంగా భవిష్యత్తులో రంభ కూతురు పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు.