Viral News : భారత దేశంలో ఇప్పటికే తంత్ర విద్యల్లాంటి మూఢాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడిశాలో ఓ యువతికి అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఓ మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లారు. అతడు తంత్ర విద్యలు తెలిసిన అతడికి యువతిని చూపెట్టారు. ఆ మంత్రగాడు వైద్యం పేరుతో ఆమె తలలోకి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 77 సూదుల్ని దించాడు. అతడిపై ఉన్న నమ్మకంగా కుటుంబ సభ్యులు కూడా అతడిని వారించలేదు.
చదవండి : అకౌంట్లో ఇంతకంటే ఎక్కువ జమ చేస్తే జరిమానాలే.. జర జాగ్రత్త!
ఒడిస్సా(Odisha) రాష్ట్రంలోని బాలింగీర్ జిల్లాకు చెందిన రేష్మకు(19) ఇలా సూదుల్ని దించడంతో తీవ్రంగా తల నొప్పి వచ్చింది. అది భరించలేనంతగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సీటీ స్కానింగ్ చేసి చూడగా వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమె తలలో సూదులు ఉండటాన్ని వారు గుర్తించారు. దీంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి : టీచర్‌గా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
వెంటనే వైద్యులు శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ చేసి ఆమె పుర్రెకు(Skull) గుచ్చుకుని ఉన్న మొత్తం 77 సూదుల్ని(77 Needles) తొలగించారు. అందుకు వారికి గంటన్నర పాటు సమయం పట్టింది. అదృష్ట వశాత్తూ మాంత్రికుడు గుచ్చిన సూదులు తలలోపలికంటే వెళ్లలేదని వైద్యులు తెలిపారు. లేదంటే మెదడుకు కూడా ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు. తాంత్రిక విద్య పేరుతో ఆ యువతి తలలోకి తానే సూదులు గుచ్చినట్లు అతడు ఒప్పుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

