»Child Marriage That Came To Light Late In Mahabubnagar District Pocso Case Against The Groom
POCSO Case: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాల్య వివాహం.. వరుడిపై పోక్సో కేసు
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మహాబూబ్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు వరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Child marriage that came to light late in Mahabubnagar district.. POCSO case against the groom
POCSO Case: దేశంలో ఇంకా అక్కడక్కడి చీకటి ఉందనడానికి కొన్ని సంఘటనులు జరుగుతుంటాయి. ఎన్ని చట్టాలు వచ్చినా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. బడికి వెళ్లె పిల్లలకు వివాహాలు చేస్తున్నారు. ఆ పసిపాపల జీవితాలతో ఆడుకుంటున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమ్మాయి ఆరో తరగతి చదువుతుంది. అదే జిల్లాలోని గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఉండే బీరప్ప అనే యువకుడు తనను పెళ్లి చేసుకున్నాడు. తాను చదువుకుంటుంది అని తెలిసి కూడా బంధువులు అందరూ కలిపి వారికి పెళ్లి చేశారు. ఇదంత వేసవి కాలంలో జరిగింది. ఇటీవలే పాఠశాలకు చదువుకోవడానికి వెళ్లిన సదరు అమ్మాయిని చూసిన టీచర్లు అసలు విషయం తెలుసుకున్నారు. ఆమె ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆరా తీశారు. వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పూర్తి విషయాన్ని విచారించి బాలికను స్టేట్‌హోంకు తరలించారు. తరువాత పోలీసులకు అధికారులు సమాచారం ఇవ్వడంతో వరుడు బీరప్ప, అతని కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.