On the occasion of Valentine's Day, Tandel Team.. Naga Chaitanya, Sai Pallavi Special Video
Valentine’s Day: ప్రేమికుల రోజు(Valentine’s Day) సందర్భంగా తండేల్(Tandel ) టీమ్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. వాలెంటైన్స్ డై విషేస్ చెబుతూ నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) ఒక వీడియోను అందించారు. బుజ్జితల్లి వచ్చేస్తున్న కదనే, కాస్త నవ్వవే అంటూ చై చెప్పే డైలాగ్స్‌కు సాయిపల్లవి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. తండేల్ మూవీ గ్లింప్స్‌లోని ఆడియో, మ్యూజిక్‌ను ఉపయోగించుకోని ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సాయి పల్లవి ఓ హిందీ సినిమా షూటింగ్లో భాగంగా జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే చైతన్య హైదరాబాద్‌లో ఉన్నారు. వీరిద్దరిని మెర్జ్ చేసి ఓ రీల్‌ను క్రియేట్ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించిన చందు ఈ మూవీని కూడా అదే రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే లవర్స్ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుని అందరి ఆకట్టుకున్నారు. మళ్లీ అదే జంట తెరపై కనిపించడం కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడానికి ఓ కారణం.