NLR: జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సతీమణి గునుకుల విజయలక్ష్మిని నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్గా గురువారం నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనసేన కోటాలో చాలామంది ఏఎంసీ డైరెక్టర్ పదవి కోసం పోటీపడినా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆశీస్సులతో ఏఎంసీ డైరెక్టర్ పదవికి ఎంపికయ్యారు.