ప్రకాశం: వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. వినాయక మండపాలకు పర్మిషన్ తీసుకోవాలని, కమిటీ సభ్యులు వారి ఆధార్ కార్డును వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని తెలిపారు.