BHPL: రేగొండ మండలం గడిపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు పోషకాహారం, విద్య అందించి భవిష్యత్తుకు పునాది వేస్తాయని తెలిపారు. భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసి, పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.