ASR: రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ దొన్నుదొర హామీ ఇచ్చారు. శుక్రవారం అరకులోయలోని దొన్నుదొర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు విశేష స్పందన వచ్చింది. పింఛను సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని దొన్నుదొర తెలిపారు.