NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుండి రూ.10,87,000 రూపాయలు మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.