TPT: సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. స్వచ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి బైరాగిపట్టెడలోని బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇతర కూటమి నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.