TG: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు. యూరియా కొరతపై భారత రాష్ట్ర సమితి, భాజపా చేస్తున్న రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.