KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఇటీవల మృతిచెందిన బాల కనకయ్య అనే గ్రామస్థుడి కుటుంబ సభ్యులకు పొదుపు సంఘం బీమా డబ్బులను అందజేశారు. కేశవపట్నం పురుషుల పొదుపు సంఘంలో సభ్యుడైన బాల కనకయ్యకు చెందిన రూ.80వేల బీమా నగదును సంఘం అధ్యక్షుడు రాచర్ల మల్లేశం,సభ్యులు మృతుడి భార్యకు అందజేశారు. దురదృష్టవశాత్తు మరణిస్తే రూ. 60వేల- రూ.లక్ష వరకు బీమా వర్తిస్తుందన్నారు.