RR: తెలంగాణ సాంప్రదాయాలను ఆచారాలను ప్రతిబింబజేసేదే బోనాల పండుగ అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో మల్లన్న బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మల్లన్న స్వామి బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.