హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం కల్లు గీత కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. నూతన మద్యం పాలసీ కార్మికులకు ప్రయోజనం కలిగేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ నాగపురి రాజయ్య పాల్గొన్నారు.