ADB: మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం తెలియజేశారు. రూరల్ మండలం అంకోలి గ్రామంలోని ఇరు వర్గాల వారికి ఎలాంటి సమస్యలున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.