W.G: భీమవరంలోని నిర్మల్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణని, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం కలిసి మాట్లాడారు. వచ్చే పుష్కరాలకు నరసాపురం నియోజకవర్గానికి అధికంగా నిధులు కేటాయించి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకర్ మంత్రిని కోరారు.