ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పెద్ద ఎత్తున తాత్కాలిక నియామకాలను చేపట్టింది. బిగ్ బిలియన్ డేస్ సమయంలో కస్టమర్ల తాకిడిని తట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, లాస్ట్ మైల్ డెలివరీ రంగాల్లో 2,20,000కు పైగా తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. లాజిస్టిక్ నెట్ వర్క్ టైర్-2, టైర్-3 నగరాల్లో ఓన్లీ డెలీవరీలు హబ్‌లు ఏర్పాటు చేయనుంది.