తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in వైబ్సైట్లో టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ కూడా ప్రారంభం కానుంది.