దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు లేకపోవడంతో మన సూచీలపై ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.83గా ఉంది.