W.G: ఉమ్మడి జిల్లా ఫెన్సింగ్ వ్యక్తిగత, టీం విభాగాల్లో బాల బాలికలకు ఎంపికలు ఈనెల 26న తణుకు మండలం తేతలిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలులో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. క్రీడాకారులు 2025 డిసెంబరు 31కి 17 సం.ల్లోపు ఉండాలని, అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి గుర్తింపు కార్డుతో వ్యక్తిగత క్రీడా పరికరాలతో హాజరు కావాలన్నారు.