AKP: నక్కపల్లి మండలం దేవవరం పంచాయతీలోని ఒడ్డిమెట్ట వినాయక ఆలయం వద్ద మెట్లు, ర్యాంప్ నిర్మించారు. ఈ ర్యాంపును కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ప్రారంభించారు. రూ.1.50లక్షల దాతల సహకారంతో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మెట్లు, ర్యాంపు ఏర్పాటు చేయడం హర్షణీయమని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.