BPT: బాపట్ల టీడీపీ కార్యాలయంలో పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అనగాని సత్య ప్రసాద్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఎమ్మెల్యేలు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీల ప్రతిపాదనలు పరిశీలకులతో కలిసి స్వీకరించారు.