TG: హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు వేధించారు. బైక్పై వెంబడిస్తూ స్కూటీ మీద ఉన్న యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. యువకుల ఆగడాలను వెనుక కారులో వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మీడియా నెట్టింట వైరల్ కావడంతో యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.