KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమకు ప్రభుత్వ నుంచి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.