BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి మణుగూరు నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై తోగూడెం వద్ద అదుపుతప్పి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.