SRCL: ఎల్లారెడ్డిపేట బీజేపీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వాఖ్యలు చేశాడని అన్నారు. ప్రశాంతంగా ఉన్న మండలాన్ని మతం పేరుతో రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.