TG: మెదక్ జిల్లాలో వరదలో చిక్కుకున్న 8 మందిని సురక్షితం అని అధికారులు తెలిపారు. హవేలి ఘనపూర్ మండలం రాజ్పేట తండాలో వరదలో చిక్కుకున్న10 మందిలో 8 మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తోంది. కాగా, లెఫ్ట్నెంట్ కల్నల్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. 30 మంది జవానులు సహాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.