MDK: పెద్ద శంకరంపేట మండలంలో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలో వరద ముప్పు ఏర్పడింది. ఈ పరిస్థితిని పర్యవేక్షించిన అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి బుధవారం తమ సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. వరదలో ఇరుక్కున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వర్షం కారణంగా అడ్డంకిగా మారిన దారులను శుభ్రం చేయించారు.