NLR: కావలి మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ షేక్ రసూల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం మద్దూరుపాడు వద్ద ఆర్కే డాబా సమీపంలో ఫ్లై ఓవర్ పై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతుడు రసూల్ కుమారుడు అల్తాఫ్ ఫిర్యాదు మేరకు కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.