AP: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులంతా ఎక్కడిక్కడ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మత్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.