కోనసీమ: ఉప్పలగుప్తం మండలం, భీమనపల్లి గ్రామం లో శ్రీ అనంగేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఛైర్మన్గా సుధా రామకోటేశ్వరరావు, సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.