TPT: గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం బీసీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.