SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘శక్తి యాప్’ అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టెక్కలి డివిజన్ శక్తి టీమ్ ఇంఛార్జ్ గిరిధర్ ఆధ్వర్యంలో ‘శక్తి యాప్’ ఉపయోగాలు, ఇన్సులేషన్ విధానాన్ని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ల పనితీరును విద్యార్థులకు వివరించారు.