HYD: ప్రజాపోరాటం, దమనకాండకు చిహ్నంగా నిలిచిన బషీర్‌బాగ్ రక్తపాతానికి నేటితో 25 ఏళ్లు అవుతుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నాటి చంద్రబాబు సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం అది. 2000 AUG 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.. రాళ్ల వర్షంతో వారంతా తిరగబడ్డారు.