GNTR: రాష్ట్రస్థాయి మహిళల సాఫ్ట్బాల్ పోటీలు ఈనెల 30, 31 తేదీలలో ధూళిపాలలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయని బుధవారం సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.