SRPT: జిల్లా వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే హుజూనగర్లోనూ భారీగా విగ్రహ ప్రతిష్టలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టలు జరిగిన చోట ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హుజూర్నగర్ SI మోహన్ బాబు మండపాల వద్ద భద్రతా పరమైన ఏర్పాట్లలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడుతున్నందున తీసుకోవాల్సీన జాగ్రత్తలను ఉత్సవ కమిటి సభ్యులకు సూచించారు.