KMR: బిక్కనూర్- అంతంపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు వరద ఉధృతికి పూర్తిగా తెగిపోయింది. దీంతో గురువారం రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కేవలం రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయి గుంతలుగా మారింది. దీంతో గ్రామాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.